పొగాకు, దానితో తయారైన ఉత్పత్తులపై అధిక ఎక్సైజ్ సుంకం విధించేందుకు ఉద్దేశించిన ‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025’కు మూజువాణి ఓటుతో లోక్‌సభ 2025, డిసెంబరు 3న ఆమోదం తెలిపింది. జీఎస్టీ పరిహార సెస్సు ముగిసిన తర్వాత నుంచి చట్టం అమలయ్యేలా బిల్లును ప్రతిపాదించారు. సిగరెట్లు, చుట్టలు, హుక్కా, జర్దా, నమిలే పొగాకుపై ప్రస్తుతం 28% జీఎస్టీతో పాటు వేర్వేరు రేట్లతో సెస్సు ఉంది. త్వరలో ముడి పొగాకుపై 60-70 శాతం ఎక్సైజ్ డ్యూటీ పడనుంది.