- సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై ఆరోగ్య సెస్ 2026, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్‌టీ రేటుకు మించి అత్యధికంగా 40 శాతం వీటిపై సుంకం విధించారు. 2017 జులై 1న జీఎస్‌టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వస్తువులపై ఉన్న 28 శాతం జీఎస్‌టీ, పరిహార సెస్‌ను ఎక్సైజ్ సుంకాలు, ఆరోగ్య సెస్ భర్తీ చేస్తాయి.
- పొగాకు ఉత్పత్తులకు (నమిలే పొగాకు, ఫిల్టర్ ఖైనీ, జర్దా సెంటెడ్ పొగాకు, గుట్కా) కొత్త ఎంఆర్‌పీ ఆధారిత మూల్యాంకన విధానం ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ప్యాకేజీపై ప్రకటించిన రిటెయిల్ అమ్మకపు ధర ఆధారంగా జీఎస్‌టీ నిర్ణయిస్తారు.