- పాకిస్థాన్ తొలి ‘రక్షణ బలగాల అధిపతి (సీడీఎఫ్)’గా సైన్యాధ్యక్షుడు ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ 2025, డిసెంబరు 4న నియమితులయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫార్సు మేరకు ఆయన నియామకానికి దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ఆమోద ముద్ర వేశారు. మునీర్ ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. సీడీఎఫ్ పదవిని కొత్తగా ఏర్పాటుచేస్తూ పాక్ పార్లమెంటు 2025 నవంబరులో 27వ రాజ్యాంగ సవరణకు ఆమోదం తెలిపింది.
- జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సీజేసీఎస్‌సీ) ఛైర్మన్ పదవిని రద్దు చేసి.. దాని స్థానంలో సీడీఎఫ్‌ను తీసుకొచ్చారు.