పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నిఘా సంస్థ ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ మహమ్మద్ ఆసిమ్ మాలిక్ నియమితులయ్యారు. ఆయన దేశానికి పదో జాతీయ భద్రతా సలహాదారు. అయితే ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న అధికారిని సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి.