పాకిస్థాన్‌కు చెందిన ఉపగ్రహాన్ని చైనా 2025, జనవరి 17న ప్రయోగించింది. జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి చేపట్టిన ఈ ప్రయోగంలో లాంగ్‌మార్చ్-2డీ రాకెట్ పాక్‌కు చెందిన పీఆర్‌ఎస్‌సీ-ఈఏ1 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇదే రాకెట్ టియాన్లు-1, లాన్‌టన్-1 అనే మరో రెండు ఉపగ్రహాలనూ మోసుకెళ్లింది. ఈ ప్రయోగం లాంగ్‌మార్చ్ రాకెట్ 556వ ఫ్లైట్ మిషన్.