చైనా నిధులతో బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో పాకిస్థాన్ నిర్మించిన అతిపెద్ద విమానాశ్రయం 2025, జనవరి 20న అధికారికంగా ప్రారంభమైంది.
మొదటి వాణిజ్య విమానం కరాచీ నుంచి బయల్దేరి గంట పది నిమిషాల తర్వాత గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు (సీపీఈసీ) కింద బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో నిర్మించిన గ్వాదర్ అంతర్జాతీయ విమానాశ్రయం, గ్వాదర్ పోర్టులతో రెండు దేశాల వాణిజ్య, ప్రాంతీయ రాకపోకలు పెరుగుతుందని భావిస్తున్నారు.