Published on Feb 21, 2025
Current Affairs
పంకజ్‌ అడ్వాణీ
పంకజ్‌ అడ్వాణీ

భారత క్యూ స్పోర్ట్స్‌ స్టార్‌ పంకజ్‌ అడ్వాణీ ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.

2025, ఫిబ్రవరి 20న దోహాలో జరిగిన ఫైనల్లో అమీర్‌ సార్కోష్‌ (ఇరాన్‌)పై 4-1తో పంకజ్‌ విజయం సాధించాడు. పంకజ్‌కి ఇది 14వ ఆసియా టైటిల్‌. 

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో పంకజ్‌ ఇప్పటిదాకా స్నూకర్‌లో 5, బిలియర్డ్స్‌లో 9 టైటిళ్లు నెగ్గాడు. 2006, 2010 ఆసియా క్రీడల్లోనూ అతడు పసిడితో మెరిశాడు.