ఐబీఎస్‌ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్‌లో పంకజ్ అడ్వాణీ విజేతగా నిలిచాడు. 2024, నవంబరు 9న దోహాలో జరిగిన ఫైనల్లో అతడు 4-2 తేడాతో రాబర్ట్ హాల్ (ఇంగ్లాండ్)ను ఓడించాడు.
ఇది పంకజ్ నెగ్గిన 28వ ప్రపంచ టైటిల్. అంతేకాక పంకజ్‌కు ఇది వరుసగా ఏడో ట్రోఫీ. 2016 నుంచి (కరోనా కారణంగా 2020, 2021లో టోర్నీలు జరగలేదు) నుంచి అతని జైత్రయాత్ర కొనసాగుతోంది.