ఇళ్ల పైకప్పులపై సౌరశక్తి ఫలకాలు ఏర్పాటు చేసుకుని, ఉత్పత్తి చేసే విద్యుత్తు ద్వారా, ఇంటి అవసరాలు తీర్చుకునేందుకు కేంద్రప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్
పథకం కింద ఇప్పటివరకు (2025, మార్చి 11) 10.09 లక్షల ఇళ్లకు ప్రయోజనం చేకూరినట్లు కొత్త, పునరుత్పత్తి ఇంధన మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు.
ఇవి 3 గిగావాట్ల విద్యుదుత్పత్తికి సమానమని పేర్కొన్నారు. 2025 అక్టోబరు నాటికి 20 లక్షలు, 2027 మార్చికల్లా కోటి ఇళ్లకు సౌరవిద్యుత్తు అందించాలన్నది ఈ పథక లక్ష్యం.