ప్రతిభావంతులైన విద్యార్థులు ‘నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో’ (క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్- క్యూహెచ్‌ఈఐల్లో) ప్రవేశాలు పొందడానికి అవసరమైన ఆర్థికసాయం అందించే ‘పీఎం-విద్యాలక్ష్మి’ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం 2024, నవంబరు 6న ఆమోదించింది. దీనికోసం 2024-25 నుంచి 2030-31 మధ్య రూ.3,600 కోట్లు కేటాయించడానికి సమ్మతించింది.
ఎలాంటి పూచీకత్తు, హామీదారులు అవసరం లేకుండానే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు. ఏటా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఈ మేరకు ప్రయోజనం పొందవచ్చు.