రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్) పథకాన్ని కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది.
రోడ్డు ప్రమాద బాధితులు లేదా... ప్రమాద సమయంలో అక్కడున్న ఎవరైనా 112కు డయల్ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను, అంబులెన్సు సేవలను కోరవచ్చని తెలిపింది.