Published on Dec 21, 2024
Current Affairs
పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌
పీఎం రాష్ట్రీయ బాల పురస్కార్‌

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాత్రపు జెస్సీరాజ్‌కు ప్రతిష్ఠాత్మక ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌-2025’ వరించింది.

దేశవ్యాప్తంగా ఏటా వివిధ అంశాల్లో ప్రతిభ చూపిన 25 మంది చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది.

తాజా జాబితాను ఇటీవల కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ప్రకటించింది. 

జెస్సీ వయసు 14 ఏళ్లు.. తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె అంతర్జాతీయ స్కేటింగ్‌ క్రీడాకారిణి. స్వస్థలం గుంటూరు జిల్లాలోని మంగళగిరి.

తన తొమ్మిదో ఏట నుంచి స్కేటింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. ఇప్పటి వరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తూ 50 పతకాలు, బహుమతులు సాధించింది.