Published on Aug 29, 2025
Current Affairs
పీఎం జన్‌ధన్‌ యోజన పథకం
పీఎం జన్‌ధన్‌ యోజన పథకం

పీఎం జన్‌ధన్‌ యోజన పథకం ప్రారంభించి 2025, ఆగస్టు 28 నాటికి 11 ఏళ్లు పూర్తయ్యింది.

ఈ కాలంలో ఆ ఖాతాల్లో డిపాజిట్లు దాదాపు 16 రెట్లు పెరిగాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా అందించడం కోసం 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రుణ సౌకర్యం, సామాజిక భద్రత, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

11 ఏళ్లలో జన్‌ధన్‌ ఖాతాలు 281%, అందులో డిపాజిట్లు 1,608% పెరిగాయి.

ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్‌ మొత్తం కూడా 337% పెరిగింది.

మొత్తం ఖాతాల్లో 67% గ్రామీణ, పట్టణ శివారు ప్రాంతాలకు చెందినవి కాగా, 56% మహిళలవి ఉన్నాయి.