Published on May 19, 2025
Current Affairs
పీఎస్‌ఎల్‌వీ-సీ61 విఫలం
పీఎస్‌ఎల్‌వీ-సీ61 విఫలం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 101వ కారెట్‌ ప్రయోగం విఫలమైంది.

2025, మే 18న తిరుపతి జిల్లాలోని సతీశ్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.

తర్వాత 12వ నిమిషంలోనే లోపం తలెత్తింది.

రెండు దశల వరకు అంతా బాగానే ఉంది.

మూడోదశ మోటార్‌ సరిగ్గానే మొదలైనా.. ఆ దశలోనే సమస్య వచ్చిందని, అందువల్ల మిషన్‌ పూర్తికాలేదని ఇస్రో ఛైర్మన్‌ వి.నారాయణన్‌ ప్రకటించారు.

మోటార్‌ కేసులో ఛాంబర్‌ ప్రెషర్‌ తగ్గిపోవడంతో ఈ వైఫల్యం ఎదురైందన్నారు.

ఎన్‌వీఎస్‌-02 వైఫల్యం తర్వాత..

2025 జనవరి 29న ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 వాహకనౌక ద్వారా సొంత నావిగేషన్‌ వ్యవస్థ కోసం ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టింది.

ఉపగ్రహంలో సాంకేతిక లోపంతో అప్పట్లో ఇదీ నిర్ణీత భూస్థిర కక్ష్యలోకి వెళ్లలేదు.

ప్రస్తుతం అది వృత్తాకార కక్ష్యలో నుంచి పనిచేస్తోంది.

దాని నుంచి తేరుకుని సరిహద్దుల భద్రత కోసం ఈఓఎస్‌-09 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపాలని ముందుకెళ్లిన శాస్త్రవేత్తలకు మళ్లీ నిరాశే మిగిలింది.