దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ (1,725) తర్వాత అత్యధికంగా కేంద్రం నుంచి 935 పీఎంశ్రీ పాఠశాలలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించింది. ఈ పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు కేంద్రం 60% నిధులు ఇస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40% వెచ్చిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎంశ్రీ బడుల్లో మౌలిక సదుపాయాలకు రూ.407.53 కోట్లను కేంద్రం మంజూరు చేసింది.
ఇప్పటికే పాఠశాలల్లో సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో పనులు సాగుతున్నాయి. ఈ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిర్వహణ నిధులను రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు విడుదల చేశారు.