దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2021లో పీఎల్‌ఐ పథకాలను ప్రకటించింది.
టెలీకమ్యూనికేషన్స్, వైట్ గూడ్స్, టెక్స్‌టైల్స్, వైద్య పరికరాల తయారీ, వాహన, స్పెషాల్టీ స్టీల్, ఆహార ఉత్పత్తులు, అధిక సామర్థ్యం కలిగిన పీవీ మాడ్యూళ్లు, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీస్, డ్రోన్లు, ఔషధాల లాంటి 14 రంగాలకు రూ.1.97 లక్షల కోట్లతో ఈ పథకాలను ప్రభుత్వం ప్రకటించింది.
ఇందులో భాగంగా ఇప్పటి వరకు సుమారు రూ.14,020 కోట్ల నిధులను 10 రంగాలకు ప్రోత్సాహకాలుగా అందించించినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.