Published on Oct 2, 2024
Current Affairs
‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకం
‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకం

దేశంలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) వినియోగం పెంచేందుకు, ఛార్జింగ్‌ వసతుల ఏర్పాటుకు, ఈవీల తయారీ వ్యవస్థ అభివృద్ధికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం 2024, అక్టోబరు 1న రూ.10,900 కోట్లతో ‘పీఎమ్‌ ఇ-డ్రైవ్‌’ పథకాన్ని ఆవిష్కరించింది. 2024 అక్టోబరు 1 నుంచి 2026 మర్చి 31 వరకు దీన్ని అమలు చేస్తారు. 2024 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు అమలైన ఈఎమ్‌పీఎస్‌-2024 స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. అంతక్రితం ఫేమ్‌ పథకాలుండేవి.