ప్రధాన్ మంత్రి ముద్రా యోజన (పీఎమ్‌ఎమ్‌వై) కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేసి రూ.20 లక్షలుగా 2024, అక్టోబరు 25న కేంద్రం సవరించింది. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
ముద్రా పథకం ప్రధాన లక్ష్యమైన ‘పథకాల లబ్ధి అందని వారికి నిధులందించడా’న్ని మరింత ముందుకు తీసుకెళతామని ఆర్థిక శాఖ పేర్కొంది.
కార్పొరేట్ యేతర, వ్యవసాయేతర సూక్ష్మ, చిన్న స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం 2015లో పీఎమ్‌ఎమ్‌వైని ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టారు.