Published on Feb 4, 2025
Government Jobs
పీఎఫ్‌సీలో ఆఫీసర్‌ పోస్టులు
పీఎఫ్‌సీలో ఆఫీసర్‌ పోస్టులు

పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (పీఎఫ్‌సీ), దిల్లీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 30

వివరాలు:

1. ఈ2- ఆఫీసర్‌: 14

2. ఈ1-డిప్యూటీ ఆఫీసర్‌-1: 16

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, టెలీకమ్యూనికేషన్స్‌, మెకానికల్, మానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్, ప్రొడక్షన్‌, పవర్‌), ఎంబీఏ, పీజీపీ, పీజీడీబీఏ, ఎల్ఎల్‌బీలో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఈ2 ఆఫీసర్‌కు 30 ఏళ్లు, ఈ1 డిప్యూటీ ఆఫీసర్‌కు 28 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు ఈ2- ఆఫీసర్‌కు రూ.50,000 - రూ.1,04,850, ఈ1-డిప్యూటీ ఆఫీసర్‌కు రూ.40,000 - రూ.83,880.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13-02-2025. 

Website:https://pfcindia.com/ensite/Home/VS/40