పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఛైర్‌పర్సన్‌గా శివసుబ్రమణియన్ రామన్‌ను ప్రభుత్వం నియమించింది.
2025 మేలో పదవీ కాలం ముగియనున్న దీపక్ మొహంతి స్థానాన్ని రామన్ భర్తీ చేస్తారు.
ఈయన 1991 బ్యాచ్ ఐఏఅండ్‌ఏఎస్ (ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్) అధికారి. ప్రస్తుతం డిప్యూటీ కాగ్‌గా పని చేస్తున్నారు.
ఇంతకు ముందు 2021-24 మధ్య మూడేళ్లపాటు సిడ్బీ ఛైర్మన్, ఎండీగానూ పని చేశారు.