ప్రభుత్వరంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), ఇండియన్ బ్యాంకులకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణాధికారు (సీఈఓ)లను కేంద్ర ప్రభుత్వం 2025, జనవరి 16న నియమించింది.
పీఎన్‌బీ ఎండీ, సీఈఓగా అశోక్ చంద్ర నియమితులయ్యారు. ఆయన కార్పొరేషన్ బ్యాంకుతో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఇటీవల వరకు కెనరా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. తాజాగా పదోన్నతిపై పీఎన్‌బీ ఎండీ, సీఈఓ అయ్యారు.
ఇండియన్ బ్యాంకు ఎండీ, సీఈఓగా బినోద్ కుమార్‌ను ఎంపిక చేశారు. పీఎన్‌బీలో మేనేజ్‌మెంట్ ట్రైనీగా ఆయన 1994లో నియమితులయ్యారు. అక్కడి నుంచి పీఎన్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు.