అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణాధికారిగా భారతీయ అమెరికన్ అమిత్ క్షత్రియను నియమిస్తున్నట్లు అమెరికా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ప్రకటించింది. సంస్థ తాత్కాలిక ప్రధాన నిర్వాహకుడు షాన్ పి. డఫీ ఈ విషయాన్ని తెలిపారు. భారత్ నుంచి అమెరికాకు వలసవచ్చిన తల్లిదండ్రులకు విస్కాన్సిన్‌లో జన్మించిన క్షత్రియ నాసా చరిత్రలో మిషన్ కంట్రోల్ ఫ్లైట్ డైరెక్టర్‌గా పనిచేసిన 100 మందిలో ఒకరు.