జపాన్ వాహన దిగ్గజ సంస్థలు హోండా, నిస్సాన్ 2026 కల్లా విలీనమయ్యేలా 2024, డిసెంబరు 23న ఒక అవగాహనా ఒప్పందం (ఎమ్‌ఓయూ)పై రెండు కంపెనీలు సంతకాలు చేశాయి.
ఇదే జరిగితే ప్రపంచంలోనే అతిపెద్ద మూడో వాహన సంస్థగా విలీన కంపెనీ మారుతుంది.
హోండా, నిస్సాన్, మిత్సుబిషిల మార్కెట్ విలువ ప్రకారం విలీన సంస్థ విలువ 50 బి.డాలర్ల (దాదాపు రూ.4.2 లక్షల కోట్లు)కు పైగా ఉండొచ్చు.