Published on Jan 14, 2026
Current Affairs
నాస్కామ్‌-ఇండీడ్‌ నివేదిక
నాస్కామ్‌-ఇండీడ్‌ నివేదిక
  • ప్రస్తుతం టెక్‌ సంస్థల్లో దాదాపు 40% పనులు కృత్రిమ మేధ (ఏఐ) నిర్వహిస్తున్నట్లు పరిశ్రమ సంఘం నాస్కామ్, ఇండీడ్‌ సంయుక్తంగా నిర్వహించిన ‘వర్క్‌ రీ-ఇమాజిన్డ్‌- ది రైస్‌ ఆఫ్‌ హ్యూమన్‌-ఏఐ కొలాబరేషన్‌’ సర్వే తెలిపింది. 2027 నాటికి నిపుణులు, ఏఐ కలిసి పనిచేసే వాతావరణాన్ని 97% మంది మానవ వనరుల విభాగాధిపతులు ఊహిస్తున్నారు. ఆటోమేషన్‌ పెరుగుతున్నా, నాణ్యత కాపాడేందుకు మానవ పర్యవేక్షణ తప్పనిసరి అని ఈ నివేదిక స్పష్టం చేసింది.
  • ఏఐ టెక్‌ సంస్థల్లో ఒక సహోద్యోగిగా మారిపోయింది అని నివేదిక పేర్కొంది. వివిధ విభాగాల్లో 20-40% పనులను ఏఐ నిర్వహిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.