Published on Apr 2, 2025
Government Jobs
నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టులు
నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టులు

నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) కాంట్రాక్ట్‌/ రెగ్యులర్‌ ప్రాతిపదికన టెక్నికల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 71

వివరాలు: 

జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (సివిల్‌)- 35

జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌)- 17

జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఎస్‌ఎన్‌టీ)- 3

జూనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (ఆర్‌ఎస్‌)- 4

అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (అర్కిటెక్చర్‌)- 08

అసిస్టెంట్‌ టెక్నికల్‌ మేనేజర్‌ (డెటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌)- 01

అసిస్టెంట్‌ మేనేజర్‌ (ప్రొక్యూర్‌మెంట్‌)- 01

అసిస్టెంట్‌ మేనేజర్‌ (జనరల్‌)- 02

అర్హతలు: 31.03.2025 నాటికి సంబంధిత విభాగాల్లో డిగ్రీ, బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయసు: 31.03.2025 నాటికి అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు 35 ఏళ్లు; ఇతర పోస్టులకు 20 నుంచి 35 ఏళ్లు ఉండాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు ఫీజు లేదు.

వేతనం: నెలకు అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000-రూ.1,60,000; ఇతర పోస్టులకు రూ.40,000-1,40,000. 

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల అనంతరం తుది ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 24.04.2025.

Website:https://www.nhsrcl.in/career/vacancy-notice