నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ) నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌హెచ్‌టెట్) డిసెంబర్ 2025కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్ లెక్చరర్, టీచింగ్ అసోసియేట్ హోదాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వివరాలు:
నేషనల్ హాస్పిటాలిటీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఎన్‌టెట్) డిసెంబర్ 2025
విభాగాలు:
హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ / హోటల్ మేనేజ్‌మెంట్
కలినరీ ఆర్ట్స్ / ఫుడ్ అండ్ బెవరేజ్ స్పెషలైజేషన్
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్‌మెంట్/ కలినరీ ఆర్ట్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల హాస్సిటలిటీ ఇండస్ట్రీ పని అనుభవం ఉండాలి. మాస్టర్ చివరి సెమిస్టర్‌లో చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
గరిష్ఠ వయోపరిమితి: అసిస్టెంట్ లెక్చరర్‌కు 35 ఏళ్లు; టీచింగ్ అసోసియేట్‌కు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ఎన్‌హెచ్‌టెట్ పరీక్షలో ఉత్తీర్ణత తరువాత ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్ ఆధారంగా.
పరీక్ష విధానం: 200 మార్కులకు పేపర్1, 2 ఓఎంఆర్ విధానంలో ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
పరీక్ష ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1000; మహిళలు/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.500.
పరీక్ష కేంద్రాలు: నోయిడా, చెన్నై, గువహటి, కోల్‌కతా, ముంబయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ సమర్పణ తర్వాత ప్రింట్ అవుట్ తీసుకొని డైరెక్టర్, ఎన్‌సీహెచ్‌ఎంసీటీ, ఏ-34, సెక్టార్-62, నోయిడా చిరునామాకు పంపించాలి.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులకు, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 30.11.2025.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్: 07.12.2025 - 14.12.2025.
పరీక్ష తేదీ: 14.12.2025.
Website: https://nchm.gov.in/