Published on May 12, 2025
Government Jobs
నేషనల్ హైవేస్ అథారిటీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు
నేషనల్ హైవేస్ అథారిటీలో డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు

దిల్లీలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

డిప్యూటీ మేనేజర్‌ (టెక్నికల్‌)- 60

(యూఆర్‌- 27; ఎస్సీ- 09; ఎస్టీ-04; ఓబీసీ-13; ఈడబ్ల్యూఎస్‌-07)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, వ్యాలీడ్‌ గేట్‌ స్కోర్‌-2025 ఉండాలి.

జీతం: నెలకు రూ.56,100- రూ.1,77,500.

వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు (ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది).

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతలు, గేట్‌ స్కోర్‌ ఆధారంగా.

ఆన్‌లన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 09-06-2025.

Website:https://nhai.gov.in/#/