పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ (ఎన్‌సీసీఎస్) కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 07
వివరాలు:
1. ప్రాజెక్టు అసోసియేట్-2: 01
2. సీనియర్ రీసెర్చ్ ఫెలో: 03
3. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 03
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, ఎంవీఎస్సీ, పీజీ, ఎల్ఎన్‌సీఆర్‌ఎన్‌ఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 2వ తేదీ నాటికి జూనియర్ రీసెర్చ్ ఫెలోకు 28 ఏళ్లు, సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 32 ఏళ్లు, ప్రాజెక్టు అసోసియేట్‌కు 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు ప్రాజెక్టు అసోసియేట్‌కు రూ.35,000, సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 42,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2
వేదిక: నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్, ఎన్‌సీసీఎస్ కాంప్లెక్స్, సావిత్రిబాయి పూలే పుణె యూనివర్సిటీ క్యాంపస్, గణెష్‌కింది రోడ్ పుణె-411007, మాహారాష్ట్ర
Website:https://nccs.res.in/Career