నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన సెంట్రల్/స్టేట్ యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కళాశాలల్లో 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ఐటీఈపీ)లో ప్రవేశానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో జరుగుతుంది. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో మొత్తం 6,000 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లు పొందవచ్చు.
వివరాలు:
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026- 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్
అర్హతలు: అభ్యర్థులు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా 2026లో పరీక్షకు హాజరవుతున్న వారై ఉండాలి.
పరీక్ష విధానం:
కంప్యూటర్ ఆధారిత అబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. తెలుగు సహా 13 భాషల్లో నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్ష సిలబస్: భాషలు : రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ ఆప్టిట్యూడ్ మరియు వొకాబులరీ.
డొమైన్ సబ్జెక్టులు: 12వ తరగతి సిలబస్ ఆధారంగా ఉంటాయి.
జనరల్ టెస్ట్: జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్.
టీచింగ్ ఆప్టిట్యూడ్: సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ భాషల బోధనకు సంబంధించిన అంశాలు.
దరఖాస్తు ఫీజు: ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000; జనరల్‌కు రూ.1200; ఎస్సీ/ఎస్టీ/పీడ్ల్యూబీడీ/థర్డ్ జెండర్ అభ్యర్థులకు రూ.650.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 12.02.2026- 10.03.2026.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 11.03.2026.
దరఖాస్తు సవరణ తేదీలు: 12.03.2026- 14.03.2026.
పరీక్ష తేదీ: 07.04.2026.
Website:https://exams.nta.nic.in/ncet/