న్యూదిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పీజీ(పోస్ట్ గ్రాడ్యుయేషన్)లో ప్రవేశాలకు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2025 పరీక్ష నిర్వహిస్తోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్/ పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-పీజీ 2025
అర్హత: ఎంబీబీఎస్ డిగ్రీ/ ప్రొవిజనల్ ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
పరీక్ష రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.3500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.2500.
పరీక్షా విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 రుణాత్మక మార్కు ఉంటుంది.
పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో జరుగుతుంది. ఈ పరీక్ష ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. పరీక్షా సమయం 3 గంటల 30 నిమిషాలు ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్, అమలాపురం, అనంతపురం, భీమవరం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, మచిలీపట్నం, నెల్లూరు, నరసరావుపేట, నంద్యాల, తాడిపత్రి, రాజమండ్రి, పుత్తూరు, ప్రొద్దుటూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07-05-2025.
దరఖాస్తు సవరణ తేదీలు: మే 9 నుంచి 13 వరకు.
సిటీ ఇంటిమేషన్ వివరాలు: జూన్ 2.
అడ్మిట్ కార్డులు విడుదల: జూన్ 11.
పరీక్ష తేదీ: 15-06-2025.
ఫలితాల వెల్లడి: 15-07-2025.
Website: https://natboard.edu.in/
Apply online: https://cdn3.digialm.com/EForms/configuredHtml/1815/93433/Index.html