Published on Dec 16, 2024
Current Affairs
నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2024
నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2024

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు-2024 దక్కింది. భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయం, రవాణా రంగాల్లో ఇంధన పొదుపు, సామర్థ్య చర్యలను ప్రోత్సహించి; అమలు చేసినందుకు ఈ అవార్డు లభించింది. కేంద్ర విద్యుత్‌ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ట్రాలను విద్యుత్‌ వినియోగం ఆధారంగా నాలుగు గ్రూపులుగా విభజించగా, అందులో ఏపీ గ్రూప్‌-2లో ఉంది. అందులో ఉత్తమ ప్రదర్శన కనబరిచి, స్టేట్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇంఇక్స్‌ (ఎస్‌ఈఈఐ)-2024లో 87.25 పాయింట్లు సాధించింది.