నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో 2026-27 సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్టు (డాట్) ద్వారా ఈ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం, హరియాణా క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల వ్యవధితో గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ డిజైన్ (జీడీపీడీ) కోర్సు, దాదాపు రెండున్నరేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్ కోర్సును అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు క్యాంపసుల్లో అందిస్తున్నారు.
వివరాలు:
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (B.Des)
వ్యవధి: నాలుగేళ్లు
మాస్టర్ ఆఫ్ డిజైన్ (M.Des)
వ్యవధి: రెండు సంవత్సరాల 5 నెలలు
అర్హత: ఇంటర్మీడియట్, డిగ్రీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: డిజైన్ ఆప్టిట్యూడ్ టెస్టు (డాట్) ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు గడువు: 01.12.2025.
Website:https://www.nid.edu/home