దిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ (బీఆర్‌ఐసీ-ఎన్‌ఐఐ) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ సైంటిస్ట్-1, జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 03
వివరాలు:
1. ప్రాజెక్ట్ సైంటిస్ట్-1: 01
2. జూనియర్ రీసెర్చ్ ఫెలో: 02
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ, ఎంఎస్సీ, నెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రాజెక్ట్ సైంటిస్ట్‌కు రూ.56,000, జూనియర్ రీసెర్చ్ ఫెలోకు రూ.37,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఈ మెయిల్ ద్వారా. mompcoe@nii.ac.in
దరఖాస్తు చివరి తేదీ: 2025 జూన్ 21.