భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్‌ఎల్‌సీ), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్-బి (Group-A S&T Gazetted) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 243
వివరాలు:
మొత్తం ఖాళీలను మూడు ప్రధాన విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.
1. కంప్యూటర్ సైన్సెస్ & ఐటీ: 168 పోస్టులు.
2. ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్: 25 పోస్టులు.
3. డేటా సైన్స్ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ): 50 పోస్టులు.
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ, ఎంఈ, లేదా ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: అభ్యర్థుల గేట్ (2024/2025/2026) వాలిడ్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తుది ఎంపికలో గేట్ స్కోర్‌కు 60 శాతం & పర్సనల్ ఇంటర్వ్యూకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.
వయోపరిమితి: 31/03/2026 నాటికి అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయోసడలింపు ఉంటుంది).
వేతనం: 7వ సీపీసీ పే లెవల్-10 ప్రకారం రూ. 56,100 నుంచి రూ. 1,77,500 వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు: సాధారణ & ఓబీసీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు & మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు చివరి తేదీ: 24 ఏప్రిల్, 2026
Website:https://recruitment.nic.in/