Published on Jul 4, 2025
Government Jobs
నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇండియాలో ఉద్యోగాలు
నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇండియాలో ఉద్యోగాలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌ ఇండియా తాత్కాలిక ప్రాతిపదికన మేనేజర్‌, అసోసియేట్స్‌, ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. ప్రిన్సిపల్‌ మేనేజర్‌: 01

2. సీనియర్‌ మేనేజర్‌: 01

3. మేనేజర్‌: 01

4. ప్రిన్సిపల్‌ అసోసియేట్‌: 01

5. సీనియర్‌ అసోసియేట్‌: 02

6. జూనియర్‌ అసోసియేట్‌: 02

7. జూనియర్‌ ఫెలో: 01

8. రిసెర్చ్‌ అసోసియేట్‌-I/II: 05

అర్హత: అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఈ/ ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: మేనేజర్‌ పోస్టులకు 55 ఏళ్లు, ప్రిన్సిపల్‌, సీనియర్‌ అసోసియేట్‌ పోస్టులకు 50 ఏళ్లు; జూనియర్‌ అసోసియేట్‌ అండ్‌ ఫెలోకు 35 ఏళ్లు; రిసెర్చ్‌ అసోసియేట్‌కు 40 ఏళ్లు  మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 25.07.2025.

Website:https://nif.org.in/