భారత నౌకాదళానికి ఒక స్టెల్త్ ఫ్రిగేట్, ఒక స్టెల్త్ డిస్ట్రాయర్ యుద్ధనౌకలు అందాయి.
ముంబయిలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) వీటిని నిర్మించింది.
స్టెల్త్ ఫ్రిగేట్‌కు ఐఎన్‌ఎస్ నీలగిరి అని, డిస్ట్రాయర్‌కు ఐఎన్‌ఎస్ సూరత్ అని పేరు పెట్టారు.
‘నీలగిరి’ని ప్రాజెక్ట్ 17ఏ కింద, ‘సూరత్’ను ప్రాజెక్ట్ 15బి కింద నిర్మించారు.
వీటిని నౌకాదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసింది.
నీలగిరిలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
‘సూరత్’ సాగరంలో అన్ని రకాల పోరాటాలను చేయగలదు.