Published on Dec 22, 2025
Apprenticeship
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం, మినిస్ట్రీ ఆఫ్‌ కోల్‌, నవరత్న ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌) ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చెరి(కేంద్రపాలిత ప్రాంతం)లకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 575.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 357 

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 218 

విభాగాలు: మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/సివిల్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ కెమికల్‌/మైనింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ/మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, క్యాటరింగ్‌ టెక్నాలజీ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, ఫార్మసిస్ట్‌.

శిక్షణ వ్యవధి: ఏడాది.

అర్హతలు: 2021 నుంచి 2025 మధ్యలో సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

స్టైపెండ్: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.15,028; టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు రూ.12,524. 

ఎంపిక ప్రక్రియ: డిప్లొమా, డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-01-2026.

Website:https://www.nlcindia.in/website/en/