Published on Oct 26, 2024
Apprenticeship
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు
నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్ పోస్టులు

తమిళనాడు రాష్ట్రం నైవేలిలోని ప్రభుత్వ రంగ సంస్థ- నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్) ఏడాది అప్రెంటిస్‌ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 210.

వివరాలు:

1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 181 ఖాళీలు

2. టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 29 ఖాళీలు

విభాగాలు: ఫార్మసీ, కామర్స్, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, కెమిస్ట్రీ, ఎంఎల్‌టీ, ఎక్స్-రే టెక్నీషియన్, క్యాటరింగ్ టెక్నాలజీ అండ్‌ హోటల్ మేనేజ్‌మెంట్.

శిక్షణ వ్యవధి: ఏడాది.

స్టైపెండ్: నెలకు బీఫార్మసీ అభ్యర్థులకు రూ.15,028; బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ అభ్యర్థులకు రూ.12,524. టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.12,524.

అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఫార్మసీ బీకాం/ బీఎస్సీ/ బీసీఏ/ బీబీఏ/ బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: డిప్లొమా/ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2024.

అభ్యర్థుల ఎంపిక జాబితా వెల్లడి: 07-12-2024.

జాయినింగ్‌ తేదీ: 11-12-2024.

Website:https://www.nlcindia.in/new_website/index.htm

Apply online:https://web.nlcindia.in/ldc_tat_gat_2024/