Published on Nov 26, 2024
Current Affairs
‘నేవా’లోకి ఏపీ శాసన వ్యవస్థ
‘నేవా’లోకి ఏపీ శాసన వ్యవస్థ

అసెంబ్లీ కార్యకలాపాలను కాగిత రహిత విధానంలో డిజిటల్‌ రూపంలో నిర్వహించేందుకు వీలుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్‌ ఈ-విధాన్‌ అప్లికేషన్‌ (నేవా)లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి చేరాయి.

ఇందుకు సంబంధించి ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు 2024, నవంబరు 25న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

పార్లమెంట్‌తోపాటు దేశంలోని 31 శాసనసభలు, 6 శాసనమండళ్లను ఒకే డిజిటల్‌ వేదికపైకి తెచ్చేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నేవాను ప్రారంభించింది.