Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 26, 2026
Admissions
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026

నవయుగ్ స్కూల్, సరోజినీ నగర్ (న్యూ దిల్లీ)లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 7వ తరగతులలో ప్రవేశం కోసం ఎన్‌టీఏ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పాఠశాల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అనుబంధంతో నడిచే ఒక ప్రముఖ విద్యా సంస్థ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్షలో సాధించిన ప్రతిభ (మెరిట్) ఆధారంగానే విద్యార్థులను ఎంపిక చేస్తారు.

వివరాలు: 

నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ఎంట్రన్స్‌ టెస్త్‌ (NSSNET)-2026

సీట్ల సంఖ్య:

6వ తరగతి: 105 సీట్లు (3 సెక్షన్లు).

7వ తరగతి: 58 సీట్లు (2 సెక్షన్లు).

అర్హతలు: విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి (6వ తరగతిలో చేరడానికి) లేదా 6వ తరగతి (7వ తరగతిలో చేరడానికి) ఉత్తీర్ణులై ఉండాలి లేదా 2026 మార్చి నాటికి ఫైనల్ పరీక్షలు రాస్తూ ఉండాలి. 

వయోపరిమితి: మార్చి 31, 2026 నాటికి 6వ తరగతికి: 10 నుంచి 12 సంవత్సరాల మధ్య (01 ఏప్రిల్ 2014 - 31 మార్చి 2016 మధ్య జన్మించి ఉండాలి). 7వ తరగతికి: 11 నుంచి 13 సంవత్సరాల మధ్య (01 ఏప్రిల్ 2013 - 31 మార్చి 2015 మధ్య జన్మించి ఉండాలి).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఈ పరీక్షకు ఎటువంటి దరఖాస్తు రుసుము (Fee) లేదు.

పరీక్ష విధానం: ఈ పరీక్ష పెన్, పేపర్ (Pen and Paper)మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఓఎంఆర్‌  పద్ధతిలో ఉంటుంది. నెగటివ్‌ మార్కింగ్‌ లేదు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో వస్తుంది. వ్యవధి రెండున్నర గంటలు.

సబ్జెక్టుల వారీగా వివరాలు:

6వ తరగతి: మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు. 

గణితం (50 మార్కులు), ఇంగ్లిష్-25 మార్కులు, హిందీ- 25, ఎన్విర్మెంటల్‌ సైన్స్‌, జనరల్ నాలెడ్జ్ (EVS & GK)-25, జనరల్ ఇంటెలిజెన్స్- 25 మార్కులకు ఉంటుంది.

7వ తరగతికి: మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులు. 

గణితం- 30, ఇంగ్లిష్-20, హిందీ- 20, సైన్స్‌- 20, సోషల్‌ సైన్స్‌- 20, జనరల్ నాలెడ్జ్- 20, జనరల్ ఇంటెలిజెన్స్- 20 మార్కులకు ఉంటుంది. 

అభ్యర్థి ప్రవేశానికి అర్హత సాధించాలంటే ప్రతి సబ్జెక్టులో కనీసం 50శాతం మార్కులు సాధించాలి. మొత్తం కనీసం 65శాతం మార్కులు సాధించాలి.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.02.2026.

దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2026.

పరీక్ష తేదీ: 10.04.2026.

Website:https://exams.nta.nic.in/nssnet/#%C2%A0