Published on Dec 2, 2025
Current Affairs
నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు
నవంబరులో జీఎస్‌టీ వసూళ్లు
  • దేశీయంగా 2025 నవంబరులో జీఎస్‌టీ స్థూల వసూళ్లు రూ.1,70,276 కోట్లుగా నమోదయ్యాయి. 2024 నవంబరు నాటి రూ.1,69,016 కోట్లతో పోలిస్తే, ఇవి 0.7% మాత్రమే ఎక్కువ. 2025, అక్టోబరులో రూ.1.95 లక్షల కోట్ల పన్ను వసూలైంది. 
  • జీఎస్‌టీ కింద వసూలైన మొత్తంలో, రాష్ట్రాలకు చేరే ఆదాయంలో మార్పేమీ లేదు. అన్ని రాష్ట్రాలకు కలిపి గతనెలలో రూ.86,882 కోట్ల ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ జీఎస్‌టీ ఆదాయం 5% తగ్గితే, తెలంగాణ ఆదాయం 1% పెరిగింది. 2024 నవంబరులో ఏపీకి రూ.2,828 కోట్లు రాగా, ఈసారి రూ.2,697 కోట్లకు తగ్గాయి. తెలంగాణ ఆదాయం రూ.3,880 కోట్ల నుంచి రూ.3,910 కోట్లకు పెరిగింది.