గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో 400 విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఘనత సాధించాడు. 2026, జనవరి 24న ఆస్ట్రేలియన్ ఓపెన్లో ప్రిక్వార్టర్స్ చేరే క్రమంలో మూడో రౌండ్లో 6-3, 6-4, 7-6 (7-4)తో బొటిక్ వాండి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. రోజర్ ఫెదరర్ (369), రఫెల్ నాదల్ (314) వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.