Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Nov 30, 2025
Current Affairs
నావికాదళ వైస్‌ అడ్మిరల్‌గా కుదరవల్లి శ్రీనివాస్‌
నావికాదళ వైస్‌ అడ్మిరల్‌గా కుదరవల్లి శ్రీనివాస్‌

భారత నావికాదళ వైస్‌ అడ్మిరల్‌గా కుదరవల్లి శ్రీనివాస్‌ పదోన్నతి పొందారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1968లో జన్మించిన శ్రీనివాస్‌ కోరుకొండ సైనిక పాఠశాలలో చదివి నావికాదళ వైస్‌ అడ్మిరల్‌ స్థాయికి ఎదిగిన రెండో వ్యక్తి. 1979లో కోరుకొండ సైనిక పాఠశాలలో చేరిన ఆయన తర్వాత ప్రతిష్ఠాత్మక ఖడక్‌వాస్లా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ (ఎన్‌డీఏ)లో నేవల్‌ కేడెట్‌గా చేరి, 1989లో కోర్సు పూర్తి చేశారు. 

2024లో విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డ్‌కు అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌ అయ్యారు. ఇటీవల వైస్‌ అడ్మిరల్‌ స్థాయికి ఉన్నతి పొందిన శ్రీనివాస్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎం.ఎస్‌. పవార్‌ తర్వాత కోరుకొండ సైనిక పాఠశాల నుంచి అంతటి స్థాయికి చేరిన రెండో వ్యక్తిగా నిలిచారు.