భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, ప్రొఫెసర్ నళినీ జోషికి అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలో 2025కుగాను ప్రతిష్ఠాత్మక ‘న్యూ సౌత్‌వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యూ) సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం ఆమెను వరించింది. ఈ అవార్డుకు ఎంపికైన తొలి గణిత శాస్త్రవేత్త నళినీయే. ఆమె సిడ్నీ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తిచేశారు. సిడ్నీలో గణితశాస్త్ర ప్రొఫెసర్‌గా నియమితులైన తొలి మహిళగా గుర్తింపు పొందారు.