జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (నల్సా) కార్యనిర్వాహక ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ 2025, మే 11న నియమితులయ్యారు.
మే 14 నుంచి ఆయన నియామకం అమల్లోకి వస్తుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లోని సెక్షన్ 3(2), క్లాజ్ బీ కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జస్టిస్ సూర్యకాంత్‌ను ఈ పదవిలో నియమించినట్లు కేంద్ర న్యాయశాఖ పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి తర్వాత సీనియర్ అయిన న్యాయమూర్తిని ఈ పదవిలో నియమిస్తారు.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా మే 13వ తేదీ పదవీ విరమణ చేయనున్నారు.
14న జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
అందువల్ల ఇప్పటి వరకూ నల్సా కార్యనిర్వాహక ఛైర్మన్‌గా ఉన్న ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపడతారు.