నల్సా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జస్టిస్ విక్రమ్‌నాథ్
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ-నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్‌నాథ్ నియమితులయ్యారు. 2025, నవంబరు 24 నుంచి జస్టిస్ విక్రమ్‌నాథ్ నియామకం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నవంబరు 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ పదవిలో జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. ఈ నెల 23న సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేసిన తర్వాత 24న జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. దాంతో ఆ స్థానంలో జస్టిస్ విక్రమ్‌నాథ్‌ను నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు వెలువరించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సీనియారిటీ పరంగా రెండో స్థానంలో ఉన్న వారిని ఈ పదవిలో నియమిస్తారు.