జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ (ఎన్‌ఎల్‌ఎస్‌ఏ- నల్సా) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ 2024, నవంబరు 8న నియమితులయ్యారు.
లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987లోని సెక్షన్ 3(2)(బి)కింద దఖలు పడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ను పదవిలో నియమించారు. నవంబరు 11 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి.