Published on Sep 8, 2025
Current Affairs
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం
నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం

ప్రముఖ కవయిత్రి, కాలమిస్టు నెల్లుట్ల రమాదేవిని 2025 ఏడాదికి కాళోజీ సాహితీ పురస్కారం వరించింది.

రాష్ట్రప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ రమాదేవి పేరును ఎంపిక చేసింది.

కాళోజీ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబరు 9న తెలంగాణ భాషా దినోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. 

నెల్లుట్ల రమాదేవి స్వస్థలం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌.

చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువతో అనేక రచనలు చేశారు. ‘రమ’ కలం పేరుతో కార్టూన్లు కూడా వేస్తారు.