Published on Jan 27, 2025
Current Affairs
నాలుగు ప్రభుత్వ పథకాలకు శ్రీకారం
నాలుగు ప్రభుత్వ పథకాలకు శ్రీకారం

తెలంగాణ ప్రభుత్వం 2025, జనవరి 26న రాష్ట్రంలోని 606 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్‌ కార్డుల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది.

2025లో రైతుభరోసా కింద ప్రతి ఎకరాకు రూ.12 వేలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. భూమిలేని పేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా రూ.12 వేలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.