ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని నవరత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో) మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 110 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు:
మెకానికల్ ఇంజినీరింగ్: 59 పోస్టులు
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్: 27 పోస్టులు
కెమికల్ ఇంజినీరింగ్: 24
అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్ ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2025 అర్హత సాధించి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి: 22.01.2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: శిక్షణ కాలంలో రూ.40,000 - రూ.1,40,000. శిక్షణ అనంతరం రూ.60,000- రూ.1,80,000.
ఎంపిక ప్రక్రియ: ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (గేట్-2025) మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.01.2026.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2026.
Website:https://mudira.nalcoindia.co.in/rec_portal/default.aspx